క్రీడలతో శాంతియుత సమాజం
– తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
– ఓల్డ్ తాండూరు యూనిట్-5 విజేతలకు ట్రోఫీ అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : క్రీడా పోటీలలో పాల్గొనడం ద్వారా యువతలో సత్సంబంధాలు పెరిగి శాంతియుత సమాజం నిర్మాణం అవుతుందని తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి అన్నారు. గత కొన్ని రోజుల నుంచి తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో కొనసాగుతున్న ఓల్డ్ తాండూరు యూనిటీ కప్ -5 క్రికెట్ టోర్నమెంట్ బుధవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ తో కలిసి సీఐ రాజేందర్ రెడ్డి విజేత జట్టుకు ట్రోఫీని అందజేశారు. రన్నర్ జట్టును అభినందించారు.
అనంతరం సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలతో శారీరక ధారుడ్యంతో పాటు మానసిన ఉల్లాసం లభిస్తోందన్నారు. దీంతో పాటు క్రీడల వల్ల యువతో సత్సంబంధాలు పెంపొంది శాంతియుత సమాజ నిర్మాణమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వహకులు నవాజ్, సంజీవరావు, మోయిజ్, జావిద్, ఇంతియాజ్, ఎన్ఎస్ఎయూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాడ్, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మెయిజ్ తదితరులు పాల్గొన్నారు.
