మంత్రి కేటీఆర్‌ను కలిసిన విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యాచరణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పార్టీ సంస్థాగత నిర్మాణ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిఠల్ నాయక్ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిశారు.
