తాండూరులో ఒక కరోనా కేసు
– విజ్ఞానపురి కాలనీ వాసికి పాజిటివ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: కొత్త సంవత్సరం రోజున తాండూరులో ఒక కరోనా కేసు నమోదయ్యింది. పట్టణంలోని విజ్ఞానపురి కాలనీకి చెందిన ఓ మహిళకు పాజిటివ్ నిర్దారణ అయినట్లు జిల్లా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గత కొంత కాలంగా తాండూరులో కరోనా కేసులు నిలకడగా ఉన్నాయి.
శనివారం జిల్లా ఆసుపత్రిలో 35 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో విజ్ఞానపురి కాలనీకి చెందిన మహిళకు పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో జిల్లా ఆసుపత్రి వైద్యులు ఆమెను ఐసోలేషన్‌లో ఉంచాలని కుటుంభీకులకు సూచించారు. మరోవైపు ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించి భౌతిక దూరం నిబంధనలు పాటించాలని సూచించారు.