గ్రామాల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సందడి
– గ్రామ దేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే
– ఘనంగా స్వాగతం పలికి గ్రామస్తులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలంలోని గ్రామాల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సందడి చేశారు. ఆదివారం మండలంలోని సంగెంకలాన్, కరణ్ కోట్ గ్రామాల్లో జరిగిన గ్రామ దేవతలు ఊరడమ్మల జాతర ఉత్సవాల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొన్నారు.
సంగెంకలాన్, కరణ్ కోట్ గ్రామాల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఆయా గ్రామాల నాయకులు, గ్రామ పెద్దలు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాల మద్య ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గ్రామాల్లో వెలసిన అమ్మవార్లను దర్శించుకుని పూజించారు.
గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ప్రజలు కేరింతలతో స్వాగతం పలికారు. ప్రజల ఉత్సహానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అభివాదం చేసి ఉత్తేజ పరిచారు. అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కరోనా నుంచి యావత్ ప్రపంచం పూర్తిగా కోలుకుని ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. అమ్మవారి చల్లని చూపు ప్రజలపై తప్పక ఉంటుందని పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఎమ్మెల్యే వెంట యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, తాండూరు మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు శకుంతల, ఎంపీటీసీ సాయిరెడ్డి, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రాంలింగారెడ్డి, కరణ్ కోట్ ఉప సర్పంచ్ హేమంత్ కుమార్, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల పెద్దలు ఉన్నారు.
