ఆపూర్వ స‌మ్మేళ‌నం..!

తాండూరు వికారాబాద్

ఆపూర్వ స‌మ్మేళ‌నం..!
– సంతోషంగా గ‌డిపిన పూర్వ విద్యార్థులు
– పెద్దేముల్ జెడ్పీహెచ్ఎస్ బాలిక‌ల స్కూల్ 2002 బ్యాచ్ సంద‌డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిది: ఆనాటి జ్ఞాప‌కాలు.. స్మృతులు ఎంతో మధురంటూ తాండూరు నియోజ‌క‌వ‌ర్గం పెద్దేముల్ మండ‌లంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త బాలిక‌ల పాఠ‌శాల పూర్వ విద్యార్థులు అభిప్రాయ‌ల‌ను పంచుకున్నారు. మంగ‌ళ‌వారం పాఠ‌శాల‌కు చెందిన 2001-02 బ్యాచ్ విద్యార్థులు దాదాపు 20 ఏండ్ల త‌రువాత పూర్వ విద్యార్థులు ఆత్మీయ స‌మ్మేళ‌నం జ‌రుపుకున్నారు. ప‌ట్ట‌ణంలోని హిమాల‌య హోట‌ల్‌లో పూర్వ విద్యార్థుల స‌మ్మేళ‌నాన్ని సంతోషంగా జ‌రుపుకున్నారు. అప్ప‌టి అధ్యాపకులతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చ‌దువుకున్న స‌మ‌యంలో జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకుని మ‌ధుర స్మృతుల‌ను గుర్తుచేసుకున్నారు. పూర్వ విద్యార్థుల స‌మ్మేళ‌నంలో అప్ప‌టి ఉపాధ్యాయులు విజ‌య్ కుమార్, ఎల్లారెడ్డి, ర‌వింద‌ర్ రెడ్డి, బాలమ‌ణి, చంద్ర‌క‌ళ‌, విద్యావ‌తిల‌తో పాటు తాండూరు మున్సిప‌ల్ బీజేపీ కౌన్సిల‌ర్, మ‌హిళ మోర్చ వికారాబాద్ జిల్లా అధ్య‌క్షురాలు సాహు శ్రీ‌ల‌త‌, పూర్వ విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు.