వీరశైవ సమాజంలో మేమూ ఉంటాం
– లింగ బలిజల కోసమే సంఘం ఏర్పాటు
– కులస్తులను ఓబీసీలోకి మార్చేందుకు కృషి
– లింగ బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు పటేల్ ఉదయ్ శంకర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : లింగ బలిజ సంఘం ఏర్పాటులో వీరశైవ సమాజాన్ని ఎక్కడా తక్కువ చేయలేదని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పటేల్ ఉదయ్ శంకర్ అన్నారు. వీరశైవ సమాజం, లింగ బలిజ సంఘం మద్య వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. లింగ బలిజ సంఘానికి వీరశైవ సమాజంకు సంబందం లేదని సమాజం సభ్యులు ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం లింగ బలిజ సంఘం నాయకులు మాట్లాడారు.
జిల్లా అధ్యక్షులు ఉదయ్ శంకర్ మాట్లాడుతూ వీరశైవ సమాజంను ఎక్కడా తక్కువ చేయలన్నారు. లింగ బలిజ కులస్తుల అభివృద్ధి కోసమే సంఘంను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. సమాజంలో ప్రస్తుతం ఉన్న గాండ్ల బలిజ, జంగమ కులస్తులకు బీసీ ఏ తోపాటు ఓబీసీ సర్టిఫికెట్లు ఉన్నాయన్నారు. అలాంటి సదుపాయం లేని లింగ బలిజలకు ఓబీసీ సర్టిఫికెట్లు అందేలా చేయడం లింగ బలిజ సంఘం పోరాటం చేస్తుందన్నారు.
ఓబీసీ సర్టీఫికెట్ లేక నీట్, ఐఐటీ అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీరశైవ సమాజంలోనే ఉండి లింగ బలిజల కోసం పోరాటం చేస్తామన్నారు. ఈ నిర్ణయాన్ని సమాజం పెద్దలు అర్థం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు చెన్ బసప్ప, కోటం సిద్దలింగంలు ఉన్నారు.
ఇదికూడా చదవండి…


