మంచి సేవలే మార్వాడి యువమంచ్ లక్ష్యం
– ఘనంగా మంచ్ వ్యవస్థాపక దినోత్సవం
– ఫ్రంట్ వారియర్స్కు శానిటైజర్, మాస్కుల పంపిణీ
– కారు డ్రైవర్లకు డస్ట్ బిన్‌ల వితరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో మంచి సేవలు చేయడమే తాండూరు మార్వాడి యువమంచ్ లక్ష్యమని మంచ్ సభ్యులు పేర్కొన్నారు. గురువారం మార్వాడి యువమంచ్ 38 వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలను మంచ్ అధ్యక్షులు సన్నిఅగ్రవాల్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణంలోని బాలాజీ మందిర్‌లో మంచ్ మాజీ అధ్యక్షులు దీపక్ గగ్రాని జాతీయ జెండాను ఆవి ష్కరించారు.
అనంతరం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఫ్రంట్ వారియర్స్ అయిన పట్టణ ఎస్ఐ అబ్దుల్ రవూఫ్, అరవింద్‌లతో పాటు పోలీసులకు 200 మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. అదేవిధంగా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని విలియమూన్ చౌరస్తాలో, ఇందిరా చౌక్, ఐబీ రోడ్డు మార్గంలో కారు డ్రైవర్లకు కార్ డస్ట్ బిన్లను అందజేసి స్వచ్ఛ భారత్ పై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా, మంచ్ సభ్యులు మాట్లాడుతూ గత 38 ఏండ్లుగా మంచ్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు, రోగులకు ఆక్సిజన్ సదుపాయం, రక్తదాన శిబిరాలు, వికలాంగులకు కృతిమ అవయవాల అమరిక వంటి సేవకార్యక్రమాలను కొనసాగించడం జరిగిందని వివరించారు. తాము సంపాదించిన దానిలో సగం దాచి.. నిస్వార్థంగా సమాజంలో నిరుపేదలకు మంచి సేవలను అందించడమే మార్వడి యువమంచ్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచ్ కార్యదర్శి గోవించ్ అశవా, కోశాధికారి గోపాల్ రాఠి, సభ్యులు దీపక్ గగ్రాని, మహేష్ సార్డా, విజయ్ ప్రకాష్ సార్డా, అనిల్ సార్డా, ఆశీష్ సార్డా. కరణ్ జైన్, అభిషేక్ అగ్రవాల్, ఓం తివారి, రోహిత్ సోని తదితరులు పాల్గొన్నారు.


