వ్యాపారుల అభివృద్ధికి సహాకారం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– ఎమ్మెల్యేను సన్మానించిన స్టోన్ భనవ్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వ్యాపారుల అభివృద్ధికి పూర్తి సహాకారం అందిస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా సోమవారం రాత్రి తాండూరు స్టోన్ భవన్ లో స్టోన్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మండల క్వారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం పలు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరులో వ్యాపారులకు పూర్తి స్వేచ్చ అందించడం జరుగుతుందన్నారు. స్టోన్ భవన్ వ్యాపారుల అభివృద్ధికి పూర్తి సహాకారం అందిస్తామన్నారు. తాండూరు అభివృద్ధిలో వ్యాపారులు కూడా భాగస్వాములు కావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్టోన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు అప్పూ(నయూం), కార్యదర్శి మిర్జా ఫయాజ్ బ్లైగ్, కోశాధికారి సంజీవ్ కుమార్, క్వారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, కార్యదర్శి సయ్యద్ జుబైర్ పాష, కోశాధికారి మహమ్మద్ జైనుద్దీన్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, కౌన్సిలర్ బోయరవి, సభ్యులు ఓం ప్రకాష్ సోమాని, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

