ఎమ్మెల్సీ మహేందరెడ్డికి శుభాకాంక్షలు వెల్లువ
– ప్రమాణ స్వీకారంలో శుభకాంక్షలు తెలిపిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ ఉత్సహాంగా కొనసాగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికైన మహేందర్ రెడ్డి గురువారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా తాండూరు నుంచి నేతలు భారీగా తరలివెళ్లి మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం, డీసీసీబీ డైరెక్టర్ రవీందర్ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల, టీఆర్ఎస్ ఫ్లోరీడర్ శోభారాణి, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల,
టీఆర్ఎస్ నాయకులు తాటికొండ పరిమళ్ గుప్త, సాయిపూర్ బాల్ రెడ్డి, బంటు మల్లప్ప, కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్, వెంకన్నగౌడ్, బోయరవి, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, టీఆర్ఎస్వై రాష్ట్ర నాయకులు బిర్కడ్ రఘు, టీఆర్ఎఎస్పీ నాయకులు దత్తు, నాయకులు బీదర్ రాజశేఖర్, దావులయ్య, అశోక్, శ్రీకాంత్ రెడ్డి, టైలర్ రమేష్, తదితరులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి పుష్పగుచ్చాలు అందించి.. శాలువాలతో సత్కరించి. శుభాకాంక్షలు తెలిపారు.

