రాజ్‌పుత్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

తాండూరు వికారాబాద్

రాజ్‌పుత్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
– అధ్యక్ష, కార్యదర్శులుగా మహేష్ సింగ్ ఠాకూర్, శివానంద్ సింగ్ ఠాకూర్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : రాజ్ పుత్ సంఘం తాండూరు నూతన కార్యవర్గాన్ని ఎన్నికున్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని ఇందిరానగర్‌లోని భవానీమాత దేవాలయంలో సంఘం కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. సంఘం తాండూరు అధ్యక్షులుగా మహేష్ సింగ్ ఠాకూర్, ఉపాధ్యక్షులుగా ఠాకూర్ బాలాజీ సింగ్, ఠాకూర్ సత్యనారాయణ సింగ్, ప్రధాన కార్యదర్శిగా ఠాకూర్ శివానంద్ సింగ్, సంయుక్త కార్యదర్శులుగా ఠాకూర్ దీపక్ సింగ్, ఠాకూర్ అమర్ సింగ్, కోశాధికారిగా బాల్ శివాజీ సింగ్, కార్యనిర్వహణ కార్యదర్శిగా ఠాకూర్ శరత్ సింగ్, ఠాకూర్ రాజు సింగ్, సంతోష్ సింగ్, న్యాయ సలహాదారులుగా నరేందర్ సింగ్ ఠాకూర్, కార్యవర్గ సభ్యులుగా ఠాకూర్ సూరజ్ సింగ్, ఠాకూర్ శీతల్ సింగ్, ఠాకూర్ జగన్ సింగ్, ఠాకూర్ రఘువీర్ సింగ్, ఠాకూర్ రమేష్ సింగ్, ఠాకూర్ బాబు సింగ్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూనతంగా ఎన్నికైన అధ్యక్ష. కార్యదర్శులుగా మాట్లాడుతూ సంఘం సభ్యుల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.