ఏఎంసీ చైర్మన్ విఠల్ నాయక్ పదవికాలం పొడగింపు
– రెండో సారి ఆరు నెలలు పొడగిస్తూ ఉత్తర్వులు
– కృతజ్ఞతలు తెలిపిన చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ పదవికాలాన్ని ప్రభుత్వం మరోసారి పొడగించింది. చైర్మన్ విఠల్ నాయక్తో పాటు పాలకవర్గాన్ని ఆరు నెలల పాటు పదవికాలాన్ని పోడిగించినట్లు ఎపీస్ అండ్ సెకట్రరీ రఘునందన్ రావు ఉత్తర్వులను జారీ చేశారు. ఏడాదిన్నర క్రితం మార్కెట్ కమిటీ చైర్మన్ గా విఠల్ నాయక్, వైస్ చైర్మన్ గా వెంకట్ రెడ్డి, డైరెక్టర్లు పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గత యేడాది అక్టోబర్ నాటికి వారి పదవీకాలం పూర్తయ్యింది. అప్పట్లో మొదటి సారి మార్కెట్ చట్టం ప్రకారం చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకటరెడ్డిలతో పాటు పాలకవర్గ సభ్యుల పదవికాలాన్ని ఆరు నెలలు పొడగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజాగా రెండోసారి చైర్మన్ విఠల్ నాయక్, పాలకవర్గ సభ్యులు పదవీ కాలాన్ని పొడగించింది. ఈ సందర్భంగా చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ పదవి కాలాన్ని పొడగించడంపట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపి మరో ఆరు నెలలు అవకాశం కల్పించడంతో రుణపడి ఉంటామని అన్నారు. ముఖ్యంగా త్వరలోనే 30 ఎకరాల స్థలంలో కొత్త మార్కెట్ నిర్మాణానికి ఎమ్మెల్యే సహాకారంతో భూమిపూజ చేయబోతున్నట్లు పేర్కొన్నారు.

