స‌మ స‌మాజం కోసం కృషి చేసిన మ‌హ‌నీయుడు

తాండూరు రాజకీయం వికారాబాద్

స‌మ స‌మాజం కోసం కృషి చేసిన మ‌హ‌నీయుడు
– తెలంగాణ బీసీ క‌మీష‌న్ మెంబ‌ర్ శుభ‌ప్ర‌ద్ ప‌టేల్
– కంద‌నెల్లిలో ఘ‌నంగా బ‌స‌వ జ‌యంతి
పెద్దేముల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: స‌మ స‌మాజ స్థాప‌న‌కు కృషి చేసిన మహ‌నీయుడు జ‌గ‌జ్యోతి శ్రీ‌శ్రీ‌శ్రీ బ‌స‌వేశ్వ‌రుడు అని తెలంగాణ రాష్ట్ర బీసీ క‌మీష‌న‌ర్ మెంబ‌ర్ శుభ‌ప్ర‌ద్ ప‌టేల్ అన్నారు. మంగ‌ళ‌వారం బ‌స‌వ జ‌యంతి సంద‌ర్భంగా పెద్దేముల్ మండ‌లం కంద‌నెల్లి గ్రామంలో నిర్వ‌హించిన ఉత్స‌వాల‌లో శుభ‌ప్ర‌ద్ ప‌టేల్ ముఖ్య అతిథిగా హాజ‌రై పెద్దేముల్ వైస్ ఎంపీపీ మ‌ధుల‌త శ్రీ‌నివాస్ చారీతో క‌లిసి బ‌స‌వేశ్వ‌రుని విగ్ర‌హానికి పూల‌మాల వేసి పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక విప్లవకారుడు బసవేశ్వరుడి ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో గ్రామ స‌ర్పంచ్ మోహ‌న్ రెడ్డి, సీనీయ‌ర్ జ‌ర్న‌లిస్టు శ్రీ‌నివాస్ చారి, గ్రామ పెద్ద‌లు, యువకులు త‌దిత‌రులు పాల్గొన్నారు.