దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి
– తాండూరులో యూత్ కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ సర్కారు ప్రవేశ పెట్టిన దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని తాండూరు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. శనివారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. దీక్షలో బైటాయించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయ అశోక్, ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు మోయిన్‌లకు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్‌తో పాటు పలువురు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సర్కారు ప్రవేశ పెట్టిన దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనీయర్ నాయకులు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

