మ‌హిమ‌లున్న శంఖమ‌ని టోక‌రా

జాతీయం తెలంగాణ

– మ‌హిమ‌లున్నశంఖమ‌ని టోక‌రా
– చిన్న ట్రిక్‌తో రెండు కోట్లు కొల్లగొట్టాడు
ద‌ర్శిని ప్ర‌తినిధి: తమిళనాడులో ఓ దొంగ స్వామీజీ కోట్లు కొల్లగొట్టాడు. శంఖానికి అతీంద్రీయ మహిమలు ఉన్నాయ‌ని రెండు కోట్ల రూపాయిల‌కు అమ్మి అమాయకుల‌కు టోక‌రా వేశాడు. వివ‌రాలు తెలియాలంటే మొత్తం స్టోరీలోకి వెళ్లాల్సిందే. తిరువణ్ణామలైలోని గిరివలం దర్శనానికి .. ఎక్కడెక్కడ నుంచో భక్తులు తరలివస్తారు. వాళ్ల నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి ఓ స్వామీజీ మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ పనులు చేసేందుకు ఆయన.. సెపరేట్ గ్యాంగ్‌నే మెయింటెయిన్ చేస్తున్నాడు. ఇలా ఓ శంఖానికి రెండు వైపులా పెట్టిన మందార మొగ్గలు.. క్షణాల్లోనే విచ్చుకునేలాచేయ‌డంతో పాటు బకెట్‌లో ఉన్న బియ్యం నుంచి శంఖం పైకి ఉబికివచ్చేలా ట్రిక్స్ ప్లే చేశాడు. అలా కళ్ల ముందు జరిగడంతో ఎవరైనా సరే.. ఆ శంఖానికి శక్తి ఉందనే అనుకుంటారు. ఇది నిజంగానే శంఖానికి ఉన్న శక్తి వల్ల జరిగిందా లేక ఇంకేమైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా.. లేక మ్యాజిక్కా అన్నది కనీసం ఆలోచించరు. అవతలి వాడు చెప్పిందే నిజమని దాన్ని సొంతం చేసుకోవాలని ఆశపడతారు. అయితే ఇలాంటి క్రేజీ సీన్స్ చూపించి.. మ‌హిమ‌గ‌ల‌ శంఖం అంటూ.. రెండు కోట్లకు అక్షరాల.. రెండు కోట్ల రూపాయలకు అమ్మాడు. బియ్యంలో అడుగున ఉన్న శంఖం పైకి రావడంతో.. శక్తులు ఉన్నాయని నమ్మించి రెండు కోట్లు కొట్టేశారు. ఇలా మహిమలు గల శంఖం అని నమ్మి.. ఓ వ్యాపారి రెండు కోట్లకు కొన్నాడు. ఈ విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో.. అందరి లెక్కా తేల్చే పనిలో పడ్డారు. బ్యాటరీ సాయంతో ఈ ట్రిక్ చేసినట్టు గుర్తించారు. స్వామీజీతో పాటు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి ట్రిక్కులకు ఎవరూ మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

https://images.tv9telugu.com/wp-content/uploads/2021/08/whatsapp-video-2021-08-28-at-125641.mp4?_=1

https://images.tv9telugu.com/wp-content/uploads/2021/08/whatsapp-video-2021-08-28-at-125642.mp4?_=2