దళితబంధుతో శాశ్విత ఉపాధి
– అందరిలో ఆర్ధికాభివృద్ధి సాధించాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్రంలోని దళితులు శాశ్విత ఉపాధితో ఆర్థికాభివృద్ధి చెందాలనే సీఎం కేసీఆర్ దళితబంధును ప్రవేశ పెట్టారని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరు మున్సిపల్ పరిధి 11వ వార్డుకు చెందిన కృష్ణ అనే వ్యక్తికి దళిత బంధు ద్వారా కారు మంజూరైంది. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలుతో కలిసి లబ్దిదారులకు కారును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా ఎదిగేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తీసుకువచ్చారని అన్నారు. లబ్ధిదారులు తమ కాళ్ళ మీద తామే నిలబడినప్పుడే ఈ పథకానికి సార్థకత అవుతుందని అన్నారు. ఈ పథకంతోనే దళితులు శాశ్విత ఉపాధిని పొందుతారని అన్నారు. దళిత సమాజం అభ్యున్నతికోసం ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



