మాట్లాడితే 30 ఏండ్లంటా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మాట్లాడితే 30 ఏండ్లంటా..!
– ఇన్నేండ్ల అభివృద్ధి అక్కడి గొంగలే
– ధ్వజమెత్తిన పైలెట్ రోహిత్ రెడ్డి
– చర్చనీయాంశమైన పైలెట్ విమర్శలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మాట్లాడితే 30 ఏండ్లు పాలించామంటారు.. ఇన్నేళ్లు చేసిన అభివృద్ధి ఎక్కడ వేసిన అక్కడి గొంగలిగానే కనిపిస్తుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాభివృద్ధిని విస్మరించి సొంత ఆర్థికాభివృద్ధిని సాధించారని విమర్శించారు. ఆదివారం తాండూరు మండలం గౌతాపూర్లో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహారణలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం రూ. 43లక్షల చేపట్టిన పంచాయతి భవనం, సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో తాండూరును 30 ఏండ్లు పాలించానని చెప్పుకుంటున్నగత నాయకులు చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. ఇన్నేళ్లు అవకాశం ఇస్తే ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తాండూరు ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని పక్కన పెట్టి సొంత అభివృద్ధి చేసుకున్నారని విమర్శించారు. తాజాగా తమ ఉనికికోసం పల్లె పల్లె బాట పట్టారని విమర్శించారు.

 

30 ఏండ్లలో చేసిన అభివృద్ధిని, ఆరేండ్లనే చేసి చూపిస్తామని సవాల్ చేశారు. గతంలో నామినేటేడ్ పదవులు ఆశచూపి వెంట తిప్పుకున్నారని. నేను వచ్చాకే పనిచేసే నాయకులు పదవులు వచ్చాన్నారు. ఇప్పుడు ఎవరెన్ని కుట్రలు పన్నినా తాండూరు ప్రజల నుంచి తనను దూరం చేయలేరన్నారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేసిన విమర్శలు తాండూరు రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి. పరోక్షంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఈ విమర్శలు చేసినట్లు రాజకీయ విమర్శకులు చర్చించుకుంటున్నారు.