దేశంలో త‌గ్గుముఖం ప‌డుతున్న క‌రోనా

ఆరోగ్యం జాతీయం తెలంగాణ హైదరాబాద్

దేశంలో త‌గ్గుముఖం ప‌డుతున్న క‌రోనా
– ప్ర‌స్తుతం 13 వేల పాజిటివ్ కేసులు
ద‌ర్శిని డెస్క్‌: దేశంలో క‌రోనా కేసులు హెచ్చు త‌గ్గులు అవుతున్నాయి. ప్ర‌స్తుతం దేశంలో 4.51 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,086 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో పాజిటివిటీ రేటు 2.90 శాతంగా నమోదైంది. క్రీయాశీల కేసులు 1,14,475(0.26)కి చేరాయి. నిన్న 12,456 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.53 శాతానికి తగ్గిపోయింది. ఈ రెండేళ్ల కాలంలో 4.35 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 4.28 కోట్ల మందికి పైగా వైరస్‌ను జయించారు. 24 గంటల వ్యవధిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారని మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ముందురోజు 16వేల కేసులు రాగా.. తాజాగా ఆ సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇక గత ఏడాది ప్రారంభం నుంచి 198 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. దేశ జనాభాలో 90 శాతం మంది వయోజనులకు పూర్తిస్థాయి టీకా అందినట్లు నిన్న కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు.