ఇద్దరు మట్కారాయుళ్లపై కేసు
– చిట్టీలు, రూ. 9వేల నగదు స్వాదీనం
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇద్దరు మట్కారాయుళ్లపై తాండూరు పోలీసులు కేసు నమదు చేశారు. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని మల్లప్ప మడిగ ప్రాంతంలోని ఓ వైన్స్ షాపులో మట్కా ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీశారు. అక్కడ ముతుం కపిల్ కుమార్, ముతుం శంకర్ అనే వ్యక్తులు మట్కా ఆడుతున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి 6 మట్కా చిట్టీలు, రూ. 9400ల నగదును స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పేకాట, మట్కా జూదాలకు అలవాటు పడరాదని అన్నారు. పేకాట, మట్కా ఆడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.



