యజ్ఞాలతో ప్రకృతి సంరక్షణ

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

యజ్ఞాలతో ప్రకృతి సంరక్షణ
– అందరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ఆర్యసమాజ్ భక్తిశ్రద్ధలతో శ్రావణమాస యజ్ఞం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : యజ్ఞ, యాగాలతో ప్రకృతి, సమాజ శాంతి పరుడవిల్లుతుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఆర్య సమాజంలో శ్రావణమాసం సందర్భంగా యజ్ఞ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై యజ్ఞంలో పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్చరణల మద్య ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, నేతలు యజ్ఞ మహోత్సవాన్ని జరిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ భారత సంస్కృతిలో యజ్ఞాలకు ఎంతో విశిష్ట ఉందన్నారు. యజ్ఞాల వల్ల మానవ సంపదకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. ప్రకృతిలో మార్పులు సంభవించి సంరక్షణ జరుగుతోందన్నారు. అదేవిధంగా అందరు ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాజుగౌడ్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, నరేందర్ గౌడ్, నగరె శ్వరాలయ చైర్మన్ కుంచెం మురళిధర్, పోట్లీ మహరాజ్ దేవాలయ చైర్మన్ రాజన్ గౌడ్, ఆర్య సమాజ్ కమిటీ సూర్య ప్రకాష్ ప్రధాన్, మోహన్ కుమార్, రమేష్ రావు, కమలాకర్, శివాజీ రావు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.