మీ తోడ్పాటుతో గ్రంథాల‌యాల అభివృద్ధి

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

మీ తోడ్పాటుతో గ్రంథాల‌యాల అభివృద్ధి
– ఎంపీ రంజిత్ రెడ్డిని క‌లిసిన‌ జిల్లా చైర్మ‌న్ రాజుగౌడ్
– ప‌ద‌వి ఇప్పించ‌డంపై ఎంపీకి కృత‌జ్ఞ‌త‌లు, స‌న్మానం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: గ్రంథాయాల అభివృద్ధికి తోడ్పాటు అందించాల‌ని చేవేళ్ల ఎంపీ రంజ‌త్ రెడ్డిని వికారాబాద్ జిల్లా గ్రంథాల‌య సంస్థ నూత‌న చైర్మ‌న్ రాజుగౌడ్ కోరారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో హైద‌రాబాద్‌లో ఎంపీ రంజిత్ రెడ్డిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. త‌న‌కు గ్రంథాలయ చైర్మన్ పదవి వ‌చ్చేలా కృషితో పాటు పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం పట్ల ఎంపీ రంజిత్ రెడ్డికి రాజుగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. శాలువాతో స‌త్క‌రించి.. పుష్ప‌గుచ్చం అందించి ధ‌న్య‌వాదాలు తెలిపారు.
అదేవిధంగా జిల్లాలోని అన్ని గ్రంథాలయాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఎంపీని కోరారు. మీ తోడ్పాడుతో గ్రంథాల‌యాల ఆధునీక‌ర‌ణ‌కు శాయ‌శ‌క్తులా కృషి చేస్తాన‌ని అన్నారు. ఇందుకు ఎంపీ రంజిత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని రాజుగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణు అధ్యక్షులు అప్పూ(నయూం), మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి ఉన్నారు.