గణేషుని లడ్డా.. మజకా..!
– తాండూరులో లడ్డూ వేలం రికార్డు
– రూ. 2.55లక్షల 550కి వేలం
– ఎవరెవరు ఎంతెంతకు సొతం చేసుకున్నారంటే..
తాండూరు, దర్శిని ప్రతినిధి : లడ్డా.. మజాకా.. అన్నట్లుగా తాండూరులో వినాయకుని లడ్డూకు భలే డిమాండ్ లభించింది. ఆదివారం పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా వివిధ ప్రాంతాలలో లడ్డూ వేలం నిర్వహించారు. గత యేడాది కంటే ఈ సారి లడ్డూ వేలం రికార్డు స్థాయిలో జరిగింది. సీతారాంపేట్ పటేల్ గార్డెన్ సమీపంలో శ్రీసీతారాం గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని వద్ద పూజలందుకున్న లడ్డూ భారీ రికార్డులో స్థాయిలో వేలం పలికింది. పట్టణానికి చెందిన మంచాల అశోక్ కుమార్, భాను రేఖ దంపతులు ఈ లడ్డూను రూ. 2లక్షల 55 వేల 550లకు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా పాత తాండూరు 16వ వార్డు పూడూరు గల్లిలో భగత్ సింగ్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని వద్ద కోట్ల బాస్కర్ అనే భక్తుడు రూ. 2లక్షల 31 వేలకు సొంతం చేసుకున్నారు.

భద్రేశ్వర చౌరస్తా భద్రేశ్వర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని వద్ద లడ్డును కనకం శ్రావణ్, అనిల్ కుమార్ లు రూ. 2లక్షల 2వేలకు సొంతం చే చేసుకున్నారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్తో కలిసి లడ్డును అందజేశారు.

అదేవిధంగా గాంధీ చౌక్ లోని వినాయకుని లడ్డును నగేష్ గుబ్బల వేలం పాటలో రూ. 65 వేలకు దక్కించుకున్నారు. గొల్ల చెరువు ప్రాంతంలోని భగత్ సింగ్ వినాయక ఉత్సమ సమితి వినాయకుని లడ్డును బీసీ సంఘం సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజు(బస్సు) రూ. 51 వేలకు సొంతం చేసుకున్నారు.

పట్టణంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన వేలంలో భక్తులు పాల్గొని లడ్డులను సొంతం చేసుకున్నారు.


