మువ్వెన్నెల రెపరెపలు..!
– ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవం
– జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– మున్సిపల్‌లో అట్టహాసంగా పతాకావిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం దేశంలో విలీనమైన సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత దినత్సవం తాండూరులో ఘనంగా జరిగింది. శనివారం సమైక్యత దినోత్సవం సందర్భంగా తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయజెండాకు వందనం సమర్పించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.

అదేవిధంగా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్ కుమార్, వైస్ చైర్మన్ పట్లోళ్ల దీపా నర్సింలు, ఫ్లోర్ లీడర్ శోభరాణి, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, సాజిద్ అలీ, కౌన్సిలర్లు నీరజా బాల్‌రెడ్డి, మంకాల రాఘవేందర్, ప్రవీణ్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, ఆసిఫ్, బోయరవిరాజు, వెంకన్న గౌడ్, మేనేజర్ నరేందర్ రెడ్డి, ఏఈ ఖాజా, అధికారులు, పార్టీల నాయకులు పాల్గొన్నారు. మరోవైపు పట్టణంలోని వాడవాడల్లో ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, సంఘాల నాయకులు కూడ జాతీయ జెండా ఎగురవేసి జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.



