విద్యార్థులతో దీపావళీ జోష్..!
– మార్వాడి యువమంచ్ ద్వారా ముందస్తు సంబరాలు
– స్కూళ్లు, అంగన్ వాడీలలో స్వీట్ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో తాండూరు మార్వాడి యువమంచ్ దీపావళీ జోష్ నింపింది. ప్రతి యేడాది దీపావళీ సందర్భంగా ఆల్ ఇండియా మార్వాడి యువమంచ్ ఆదేశాల మేరకు తాండూరు శాఖ ఆధ్వర్యంలో ముందస్తు దీపావళీ సంబరాలు నిర్వహించే సంప్రదాయం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా రాబోయే దీపావళీ పండగను పురస్కరించుకుని శనివారం మార్వాడి యుమంచ్ ఆధ్వర్యంలో ముందస్తు దీపావళీ సంబరాలను అట్టహాసంగా నిర్వహించింది.
పెద్దేముల్ మండలంలోని మంబాపూర్ ప్రాథమిక పాఠశాల, రేగొండి, మన్ సాన్ పల్లి, కొండాపూర్, రుక్మాపూర్ లలోని ప్రభుత్వ పాఠశాలు, అంగన్ వాడి కేంద్రాలతో ధారూరులోని కేజీబీవీ పాఠశాలలో మంచ్ సభ్యులు దీపావళీ సంబరాలను జరుపుకున్నారు. ఆయా పాఠశాలలోని విద్యార్థులకు స్వీట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంచ్ సభ్యులు మాట్లాడుతూ దీపావళీ పండగను అందరు సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా, తాండూరు అధ్యక్షులు అనిల్ సార్ధా, కార్యదర్శి సచిన్ రాఠి, పవన్ సోని, దినేష్ పర్తాని, నిహార్ సోమాని, సునీల్ సార్డా, కరణ్ జైన్, రోహిత్ అగ్రవాల్, నిఖిల్ గగ్రాణి, సోషల్ వర్కర్ కేవీఎం వెంకటయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవడి…

