వీఆర్ఏలతో ఇంకెంతకాలం చెలగాటం
– వెంటనే వారి డిమాండ్లను పరిష్కరించాలి
– పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులతా శ్రీనివాస్ చారి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం సమ్మెకు దిగిన వీఆర్ఏలతో ఇంకెంతకాలం చెలగాటం ఆడుతుందని పెద్దేముల్ మండల వైస్ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ మండల మహిళ అధ్యక్షురాలు మధులతా శ్రీనివాస్ చారి అన్నారు. పెద్దేముల్ మండలంలో వీఆర్ఏలు చేపడుతున్న సమ్మెకు శనివారం వైస్ ఎంపీపీ మధులతా శ్రీనివాస్ చారి మద్దతు తెలిపారు. సమ్మెలో కూర్చున్న వీఆర్ఏలతో కలిసి సర్కారు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏలు చేపట్టిన సమ్మె 69 రోజులకు చేరిందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం దిగిరాకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతుందని విమర్శించారు. డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టిన వీఆర్ఏలు ప్రభుత్వ వైఖరి వల్ల మనస్థాపం చెందుతున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం నాయకులు, మండలంలోని వివిధ గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు.

