దేశంలో బీఆర్ఎస్ సంక్షేమం కీల‌కం

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

దేశంలో బీఆర్ఎస్ సంక్షేమం కీల‌కం
– సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వానికి ప్ర‌జ‌ల ఎదురుచూపు
– టీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఏర్పాటు హ‌ర్ష‌ణీయం
– ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్రంలో చేప‌ట్టిన టీఆర్ఎస్ సంక్షేమ ప‌థ‌కాలు బీఆర్ఎస్ పార్టీ ద్వారా దేశ వ్యాప్తంగా విస్త‌రించ‌డంలో సీఎం కేసీఆర్ కీల‌కం కాబోతున్నార‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి అభిప్రాయం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం తాండూరు ప‌ట్ట‌ణంలోని త‌న నివాసంలో ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి మీడీయాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ పార్టీని స‌రిగ్గా 1గంట 19 నిమిషాల‌కు జాతీయ పార్టీ బీఆర్ఎస్‌గా ప్ర‌క‌టించ‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మానికి క‌ర్ణాటక మాజీ ముఖ్యమంతి, జేడీఎస్‌ నేత హెడీ కుమారస్వామి, ఆయన పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధినేత తిరుమావళన్‌తో పాటు ఎంపీలు హాజ‌ర‌య్యార‌ని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్ ప‌ర్స‌న్‌లు, ప్ర‌తినిధుల స‌మక్షంలో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా ప్ర‌క‌టించి తీర్మానించ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమ‌లు చేసిన ద‌ళిత బంధు, రైతుబంధు, మిష‌న్ భ‌గీర‌థ త‌దిత‌ర ప‌ధ‌కాలు దేశంలో కీల‌కం కాబోతున్నాయ‌న్నారు. దేశ రాజ‌కీయంలో సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వం కోసం ఎదురుచూస్తున్నార‌ని అన్నారు. రాష్ట్రంలో అమ‌లు చేసిన ప‌త‌కాల‌పై ప‌క్కా రాష్ట్రాల వారు ప‌రిశీలించ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం మోడల్‌గా నిల‌వ‌డంతో పాటు కేసీఆర్ ఆలోచనలు ఈ దేశానికి అవసర‌మ‌వుతాయ‌న్నారు. దేశంలో బీఆర్ఎస్ చారిత్రాత్మ‌కం అవుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్‌, సీనీయ‌ర్ నాయ‌కులు క‌ర‌ణం పురుషోత్తం రావు, డీసీసీబీ మాజీ చైర్మ‌న్ ల‌క్ష్మారెడ్డి, బీఆర్ఎస్ ప‌ట్ట‌ణ మాజీ అధ్య‌క్షులు అబ్దుల్ ర‌వూఫ్ త‌దిత‌రులు ఉన్నారు.