కమల దళానికి కొత్త చేరికలు బలం
– మురళీకృష్ణ గౌడ్, నరేష్ మహరాజ్ చేరిక హర్షం
– బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో కమల దళం బలమైన శక్తిగా మారబోతోందని బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ అభిప్రాయం వ్యక్తం చేశార. తాండూరుకు చెందిన వికారాబాద్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, స్వర్గీయ మాజీ మంత్రి చందు మహరాజ్ తనయుడు ఎం.నరేష్ మహరాజ్ బీజేపీ పార్టీలో చేరడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పదేళ్లుగా యంగ్ లీడర్స్ సంస్థతో యువతలో పాలోయింగ్ ఉన్న మురళీకృష్ణగౌడ్, మనసున్న మహరాజులుగా పేరున్న మహారాజుల కుటుంబ సభ్యులు ఎం.నరేష్ మహరాజ్ బీజేపీలో చేరడం వల్ల పార్టీ బలమైన శక్తిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఆ ఇద్దరు నాయకుల చేరికను స్వాగతిస్తున్నామని, వారితో సమన్వయం పాటించి కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అందరి సహాకారంతో తాండూరు నియోజకవర్గంలో బీజేపీని బలమైన శక్తిగా మారుస్తామని పేర్కొన్నారు.

