కొనుగోలు కుట్రపై కన్నెర్ర
– నీచమైన బీజేపీకి గుణపాఠమే సరి
– ఎమ్మెల్యేలకు పిరాయింపుల ఎర సిగ్గుచేటు
– నిఖార్సైన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– బీజేపీ, మోడి దిష్టిబొమ్మల దహనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన కుట్రపై తాండూరులో టీఆర్ఎస్ నేతలు కన్నెర్ర చేశారు. గురువారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, పార్టీ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, కౌన్సిలర్లు తదితరులు హాజరై బీజేపీకి, ప్రధాని మోడికి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం, ఉద్యమం కోసం ఉద్భవించిన టీఆర్ఎస్ పార్టీలో నిఖార్సైన ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. అలాంటి ఎమ్మెల్యేలు కోట్లు కుమ్మరిస్తామన్నా లొంగిపోలేరని అన్నారు. నీచ రాజకీయాలతో కమలం పార్టీ కుట్రలు చేసి ఎరవేయడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యేలను ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన బీజేపీ కుంతంత్రాలను భగ్నం చేసి.. కుట్రలను బట్ట బయలు చేశారని అన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ ఇలాంటి దిక్కుమాలిన చర్యకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. మునుగోడు ఎన్నికలతో పాటు రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి చోటు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు పిరాయింపుల ఎరను భగ్నం చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పూర్తిని కొనియాడారు. కోట్లు గుమ్మరించినా అమ్ముడుపోని వ్యక్తి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అని కీర్తించారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకుని మంత్రిగా వెలుగొందేలా తోడ్పాటు అందిస్తామన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సెల్యూట్ అంటూ.. శభాష్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడి దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు విజయదేవి, మంకాల రాఘవేందర్, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎం. శ్రీనివాస్, సంతోష్ గౌడ్, ఉపాధ్యక్షులు హరిగౌడ్, కార్మిక విభాగం అధ్యక్షులు న్యాయవాది గోపాల్, దేవాలయాల చైర్మన్లు బంటారం సుధాకర్, రాజన్ గౌడ్, సంజీవరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

