మళ్లీ కంటి వెలుగు..!

ఆరోగ్యం తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

మళ్లీ కంటి వెలుగు..!
– వచ్చే యేడాది 18 నుంచి కార్యక్రమం
– సమీక్షించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. కొత్త యేడాదిలో రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు గురువారం కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం అమలుతీరుపై సీఎం సమీక్షించారు. ప్రజారోగ్యంపై మంత్రులు, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 2018లో అమలు చేసిన కంటి వెలుగు పథకం ద్వారా రాష్ట్రంలోని అందరికీ కంటి పరీక్షలు నిర్వహించిన సర్కారు.. అవసరమైన వాళ్లందరికీ ఉచితంగా కళ్ల అద్దాలు, కంటి ఆపరేషన్లు చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. నిర్దేశించిన ఐదు నెలల్లో సాధ్యమైనంత వరకు పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. కంటి వెలుగు ద్వారా పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇచ్చిన సర్కారు.. ఆపరేషన్లు మాత్రం పూర్తిగా నిర్వహించలేకపోయింది. కంటి వెలుగు పథకం తిరిగి ప్రారంభించి.. రాష్ట్రంలోని అందరికీ మళ్లీ కంటి పరీక్షలు నిర్వహించి.. అవసరమైన వాళ్లందరికి అద్దాలు, మందులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. అవసమున్న వారికి ఆపరేషన్లు కూడా త్వరితగతిన చేయించాలని అధికారులకు కేసీఆర్ సూచించారు.