ప్రజా రక్షణ కోసమే కట్టడి తనిఖీలు

క్రైం తాండూరు వికారాబాద్

ప్రజా రక్షణ కోసమే కట్టడి తనిఖీలు
– సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
– తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్
– ఎన్టీఆర్ కాలనీలో పోలీసుల కార్డెన్ సెర్చ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజల రక్షణ కోసమే పోలీసు శాఖ ద్వారా కట్టడి తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్ సీఐ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు కాలనీని నిర్బంధించి ఇండ్లలో సోదాలు నిర్వహించారు. అక్రమ కార్యకలాపాలు, అసాంఘిక కార్యక్రమాలు, అనుమాతులు, నేరస్తుల గురించి ఆరా తీశారు. కాలనీలో జరిగిన కార్డెన్ సెర్చ్ ను డీఎస్పీ శేఖర్ గౌడ్ హాజరై పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసమే కార్డెన్ సెర్చ్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకు ప్రజలు అందరు సహకరించాలన్నారు. శాంతి భద్రతలకు, నేరాలకు జరగకుండా ఉండేందుకు కార్డెన్ సెర్చ్ ద్వారా చర్యలు చేపట్టడం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రజలు ఆన్ లైన్ మోసాలు, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా అందరు రోడ్డు నిబంధనలు పాటించాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు.

మరోవైపు ఎన్టీఆర్ కాలనీలో జరిగిన కార్డెన్ సెర్చ్ లో 119 బైకులు, 11 ఆటోలు, 8 కార్లను అదుపులోకి తీసుకవడం జరిగిందని, అందులో దృవపత్రాలు, నెంబర్ ప్లేట్లు సక్రమంగా లేని 25 వాహనాలను సీజ్ చేయడం జరిగిందని వెల్లడించారు. దీంతో పాటు 34 వాహనాలకు 79 చలాన్లను గుర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ రాంబాబు, ఎస్ఐలు వేణుగోపాల్ గౌడ్, మధుసూధన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, పోలీసు సిబ్బంది, కాలనీ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.