ఐటీఐ కాలేజీ ప్రారంభానికి కసరత్తు

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఐటీఐ కాలేజీ ప్రారంభానికి కసరత్తు
– వచ్చే యేడాది నుంచి అడ్మిషన్లు
– జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు మంజూరైన ఐటీఐ కళాశాల ప్రారంభానికి కసరత్తు జరుగుతోందని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. తాండూరు పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని డిగ్రీ కాలేజీని ఐటీఐ కళాశాల నిర్వహణకు కేటాయించిన విషయం తెలిసిందే. బుధవారం వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ ఐటీఐ కళాశాల రామానుజన్ తో కలిసి సందర్శించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఐటీఐ కళాశాలను జూనియర్ కళాశాల విద్యార్థులకు కొన్ని రోజులు కేటాయించాలని విజ్ఞప్తులు వచ్చాయి. దీనిపై రాజుగౌడ్ ఐటీఐ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తో కలిసి చర్చించారు. అయితే తాండూరుకు మంజూరైన ఐటీఐ కాలేజీకి సంబంధించిన పరికరాలు, వసతులు త్వరలో రాబోతున్నాయని ప్రిన్సిపల్ రామానుజన్ తెలపడంతో ఆ ప్రయత్నాన్ని తాత్కాళికంగా విరమించుకున్నారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో ఐటీఐ కాలేజీకి రూ. 3 కోట్లు మంజూరయ్యాయని గుర్తుచేశారు. భవనం అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఐటీఐ కాలేజీని ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతుందన్నారు. వచ్చే యేడాది నుంచే ఐటీఐ కాలేజీ అడ్మిషన్లు ప్రారంభిస్తామని, కాలేజీకి సంబంధించి ఉద్యోగాలు కూడ భర్తీ చేయబడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ రాజమోహన్, బీఆర్ఎస్వీ తాండూరు ఇంచార్జ్ జిలాని తదితరులు ఉన్నారు.