రోహిత్ రెడ్డిని మరోసారి గెలిపించుకుందాం

తాండూరు రాజకీయం వికారాబాద్

రోహిత్ రెడ్డిని మరోసారి గెలిపించుకుందాం
– బీసీ భవనఖకు కృషిచేసిన ఏకైక ఎమ్మెల్యే పైలెట్
– బీసీ సంఘం జా.కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
– బషీరాబాద్‌ మండలంలో జోరుగా ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పైలెట్ రోహిత్ రెడ్డిని మరోసారి గెలిపించుకుందామని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శనివారం బషీరాబాద్‌ మండలంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తరుపున ప్రచారం చేశారు. మండలంలోని రెడ్డిగణాపూర్, చిన్నగొట్టుగ, నవల్గా, నీళ్లపల్లి, జలాల్‌పూర్, మైల్వార్ గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో కందుకూరి రాజ్ కుమార్ సంఘం నేతలతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు చేయని విధంగా తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బీసీ సమీకృత భవనంకు స్థలాన్ని కేటాయించడమే కాకుండా రూ. 2 కోట్లు నిధులు కేటాయించిన ఏకైక ఎమ్మెల్యే అని గుర్తుచేశారు. ఎస్సీ ఎస్టీ, బిసి మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న పైలట్ రోహిత్ రెడ్డి గారికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రోహిత్ రెడ్డిని మరోసారి గెలిపించుకుంటే ప్రతి మండల కేంద్రంలో బీసీ భవన్ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. బీసీల ప్రగతి ఎమ్మెల్యేతో సాధ్యమవుతుందన్నారు.

ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి సయ్యద్ షుకూర్, బీసీ సంఘం నాయకులు బసవరాజ్, రాము ముదిరాజ్, హరి, ప్రసాద్, వెంకట్, ప్రజా ప్రతినిధులు రామకృష్ణగౌడ్, శిరీష, వెంకట్ రామ్ రెడ్డి, ముకుంద, దుర్గయ్య, సుధాకర్ రెడ్డి, బుగ్గప్ప, అనిల్, పోచయ్య వెంకటయ్య, మహబూబ్, అనిల్, సురేష్, రాములు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!