కేవీసీఎస్‌లో దూం.. దాం..!

కెరీర్ తాండూరు వికారాబాద్

కేవీసీఎస్‌లో దూం.. దాం..!
– అట్టహాసంగా గణతంత్ర వేడుకలు
– వైభవంగా వసంత పంచమి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం పొట్లిమహారాజ్ దేవాలయం ప్రాంగణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ (కేవీసీఎస్)లో ఓ వైపు గణతంత్ర దినోత్సవ వేడుకలు.. మరోవైపు వసంత పంచమి వేడుకులను దూం.. దాంగా జరుపుకున్నారు. ముందుగా 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాలలో జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు. జెండా వందనం తరువాత పాఠశాల యజమాన్య కమిటి సభ్యులు మల్లేపల్లి వెంకటేశం. డైరెక్టర్ ప్రిన్సిపల్ ప్రశాంతు, సతీష్ లు విద్యార్థుల చేత గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. చక్కటి అభినయాలతో పాటు నైపుణ్యాలను ప్రదర్శించి మైమరిపించారు. అదేవిధంగా గురువారం వసంతి పంచమి వేడుకలను కూడ స్కూల్లో వైభవంగా నిర్వహించారు. స్కూల్లో చదువుల తల్లి సరస్వతీ దేవి ప్రతిమను ఏర్పాటు చేసి వేదమంత్రాల మధ్య వేడుకలను ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు.

అక్షరాభ్యాస కార్యక్రమానికి చిన్నారుల తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల యొక్క గొప్పదనాన్ని విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా స్కూల్లో విద్యార్థులకు విద్యతో పాటు నైపుణ్యత, ప్రమాణాల పెంపుపై ప్రత్యేక శ్రద్ధ వహించడం. జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.