రుద్రభూమిలో కొలువైన శివుడు

తాండూరు రాజకీయం వికారాబాద్

రుద్రభూమిలో కొలువైన శివుడు
– వైభవంగా విగ్రహా ప్రతిష్టాపన
– పాల్గొన్న వీరశైవ సమాజం సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని వీరశైవ సమాజంకు చెందిన రుద్రభూమిలో మహ శివుడు కొలువయ్యాడు. ఆదివారం వీరశైవ సమాజం ఆధ్వర్యంలో మహ శివుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. సమాజం అధ్యక్షులు పటేల్ శ్రీశైలం, సభ్యుల ఆధ్వర్యంలో ప్రముఖ పండితులు మహంతయ్య స్వామి సమక్షంలో ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. వేదమంత్రాల మద్య మహ శివునికి పూజలు నిర్వహించి ప్రతిష్టాపనను జరిగింది. అధ్యక్షులు పటేల్ శ్రీశైలంతో పాటు సభ్యులు ప్రతిష్టించిన మహ శివున్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పటేల్ శ్రీశైలం మాట్లాడుతూ వీరశైవుల సమాజం సభ్యుల సహాకారంతో రుద్రభూమిని అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో రుద్రభూమిలో మరిన్ని మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం, వీరశైవ యువదళ్‌ సభ్యులు, పెద్దలు, యువకులు పాల్గొన్నారు.