చిరస్మరణీయుడు పట్లోళ్ల ఇంద్రారెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

చిరస్మరణీయుడు పట్లోళ్ల ఇంద్రారెడ్డి
– నివాళులు అర్పించిన నర్సింహారెడ్డి(బాబు)
– కోటబాస్పల్లిలో ఇంద్రారెడ్డి వర్ధంతి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : స్వర్గీయ హోంశాఖ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి పేదలు, కార్మికుల గుండెల్లో చిరస్మరణీయుడుగా నిలిచి ఉంటారని, ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తాండూరు సీటీ కేబుల్ ఎండీ గొట్టిగ నర్సింహారెడ్డి(బాబు) అన్నారు. శనివారం తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో ఇంద్రారెడ్డి 23వ వర్ధంతిని నిర్వహించారు. గ్రామంలో ఉన్న ఇంద్రారెడ్డి విగ్రహానికి నర్సింహారెడ్డి(బాబు) పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న ఇంద్రా రెడ్డి మహారాజుల గుత్తాధిపత్యంలో నారాయణరావు చైర్మన్ గా ఉన్న నాపరాతి గనుల భూములలో కార్మికులకు అండగా నిలిచారని అన్నారు.

కోటబాస్పల్లిలో సర్వేనెంబర్116, మల్కాపూర్ లో సర్వేనెంబర్ 15, 338లో 18 ఎకరాల భూమిని కార్మికులకు ధారదత్తం చేసిన మహానీయుడు ఇంద్రారెడ్డి అని అభివర్ణించారు. పేదల గుండెళ్లో చిరస్మరణీయుడుగా ఉన్న ఇంద్రారెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ తాండూరు మండల అధ్యక్షులు రాందాస్, గొట్టుగ రాజశేఖర్ రెడ్డి, పోలీసు వెంకటయ్య గౌడ్, ఉపాధ్యాయులు నర్సిరెడ్డి, నాగప్ప, శశిధర్, బీఆర్ఎస్ నాయకులు బురానోద్దీన్, మండల బీసీ సెల్ ఉపాధ్యక్షులు విఘ్నేష్, మైనార్టీ సెల్ కార్యదర్శి గౌసోద్దీన్, తాండూరు మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్వ రాజు, గ్రామ వార్డు సభ్యులు భాస్కర్, చాకలి నర్సింలు, దేవసూర్ నర్సింలు, మంగలి పాపయ్య, రాములు, బోయిని చంద్రప్ప, ఈడ్డి శేఖర్ గౌడ్, చిన్న సాయప్ప, మ్యాతరి నర్సింలు, భాస్కడ్. పద్మారావు రాములు, కళ్యాణ్, అంబరప్ప, నర్సింలు గౌడ్, వెంకట్ గౌడ్, చాకలి గోపాల్, వడ్డె ఆశప్ప, హన్మంతు, బాలరాజ్, వడ్డె చందర్, గుర్రంపల్లి చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.