తాండూరు విద్యావేత్తకు జాతీయ పురస్కారం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు విద్యావేత్తకు జాతీయ పురస్కారం
– విద్యారత్న అవార్డుకు ఎంపికైన పర్యాద రామకృష్ణ
– హర్షం వ్యక్తం చేసిన మిత్రులు, అధ్యాపకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరుకు చెందిన విద్యావేత్త పర్యాద రామకృష్ణ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కమిటీ 2023గాను అందిస్తున్న జాతీయ ‘విద్యారత్న’ అవార్డును అందుకోబోతున్నారు. స్వామి వివేకానంద, మహాత్మా జ్యోతిరావు ఫూలే, బి. ఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం, లాంటి అనేక మహనీయుల ఆదర్శాలు,వారి ఆశయాలు, మరియు వారి యొక్క భావజాల వ్యాప్తికి కృషి చేస్తూ, విద్యారంగంలో ఆయన సేవలకు గాను, విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంపుదలలో ఆయన పాత్రను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ తెలిపారు. అవార్డుకు సంబంధించిన ఎంపిక పత్రాన్ని వారు జాతీయ కార్యాలయం హైద్రాబాద్ లో రామకృష్ణకు అందచేశారు. ఈ పురస్కారాన్ని అక్టోబర్ 15న దేశ రాజధాని ఢిల్లీలో జరిగే బహుజన రైటర్స్ జాతీయ కాన్ఫరెన్స్ లో ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమి తెలంగాణ అధ్యక్షులు మల్లేష్ గౌతమ్, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జాతీయ పురస్కారానికి పర్యాద రామకృష్ణ ఎంపిక కావడం పడ్ల ఆయన మిత్రులు, అధ్యాపకులు ,శ్రేయోభిలాషులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!