పైలెట్ పెద్ద మనసు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పైలెట్ పెద్ద మనసు..!
– మైనార్టీల కోసం రూ. 7.31 కోట్లు కేటాయింపు
– నిధుల మంజూరు ఘనత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– కృతజ్ఞతలు తెలిపిన అఫ్పూ(నయూం)
తాండూరు, దర్శిని ప్రతినిది: తాండూరు మైనార్టీ ప్రజలకు ఇచ్చిన హామిని నెరవేర్చుకుని స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) అన్నారు. సోమవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు నియోజికవర్గంలో మైనారిటీ సంక్షేమం కోసం 7.31 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. నియోజికవర్గంలో ఎపుడు లేనివిధంగా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మైనార్టీలకు నిధుల కేటాయింపు చేయడం సంతోషం వ్యక్తం చేశారు. తాండూరు నియోజికవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో ఈద్గా, స్మశానవాటిక కాంపౌండ్(ప్రహారి) గోడ, బోర్ వెల్ కోసం నిధులు మంజూరు చేయడం చాల ఆనందనీయమన్నారు.

తాండూరు పట్టణం పాత తాండూరులో మైనారిటీ కమ్యూనిటీ హాల్ కోసం రూ. 1 కోటి, చెన్‌గెష్‌ పూర్ రోడ్ ఈద్గా కోసం రూ. 50 లక్షలు, ఉర్దూ ఘర్ అభివృద్ది కోసం రూ. 30 లక్షలు, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం రూ. 50 లక్షలు, తాండూరు పట్టణంలోని స్మశాన వాటిక అభివృద్ది కోసం రూ. 50 లక్షలు, తాండూరు నియోజకవర్గంలో ఉన్న అన్నీగ్రామాల్లో స్మశానవాటిక గోడ కోసం, ప్రతి గ్రేవ్ యార్డ్ కి రూ. 5 లక్షలు, బోరు మోటార్ల కోసం రూ. 2 లక్షలు, పెద్దముల్ శ్మశానములో గదులు కొరకు రూ. 6 లక్షలు, పలు అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేసిన ఘనత ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికే దక్కుతుందన్నారు. మైనార్టీల అభ్యున్నతినికి నిధులు మంజూరు చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. తాండూరు నియోజికవర్గ మైనారిటీ సోదరులు పైలట్ రోహిత్ రెడ్డి పూర్తి మద్దత్తుగా నిలుస్తారని పేర్కొన్నారు.