శివాజీ చౌరస్తాకు కొత్త రూపు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

శివాజీ చౌరస్తాకు కొత్త రూపు..!
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌ రెడ్డి
– చౌరస్తాలో సర్కిల్‌ నిర్మాణానికి భూమి పూజ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శివాజీ చౌరస్తాకు కొత్త రూపు తీసుకవచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రసిద్ద శివాజీ చౌరస్తాలో సర్కిల్‌ నిర్మాణానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ అభివృద్ధితో పాటు సుందరీకరణకు ప్రాధాన్యమివ్వడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని శివాజీ చౌరస్తాలో శివాజీ విగ్రహం చుట్టు సర్కిల్‌ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించేలా చూస్తామున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ చారి, బంటారం సుధాకర్, విజయ్‌ కుమార్, కౌన్సిలర్లు ప్రభాకర్‌ గౌడ్, అంతారం లలిత, సంతోష్‌ గౌడ్, రజనీకాంత్, పూజారి పాండు, కుంచెం మురళీధర్ తదితరులు పాల్గొన్నారు