ఆర్యవైశ్య కొత్త గెస్ట్ హౌస్‌కు భూమిపూజ
– పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం కళ్యాణ మండప సమీపంలో కొత్త గెస్ట్ హౌస్ నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం పాత అతిధి గృహము పైన నూతన గెస్ట్ హౌస్ నిర్మాణం కొరకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ముఖ్య అతిథిగా పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం అందరి సహాకారంతో ప్రగతిని సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సాహు శ్రీలత, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కట్కం వీరేందర్, కోటం మురళి, దాదాపుర్ రవీందర్, సీనీయర్ సభ్యులు కోస్గి తిప్పయ్య, అలంపల్లి సిద్దన్న, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…


