ప్రజారక్షణలో పోలీసులే కీలకం
– పట్టణ పోలీస్టేషన్‌కు ఉత్తమ అవార్డు అభినందనీయం
– పోలీసులను సన్మానించిన ఎన్ఎస్‌యూఐ అధ్యక్షులు సందీప్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజా రక్షణలో పోలీసుల పాత్రే కీలకమని ఎన్ఎస్‌యూఐ తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు సందీప్ రెడ్డి అన్నారు. జిల్లాలో తాండూరు పట్టణ పోలీస్టేషన్ ఉత్తమ అవార్డును సాధించడం పట్ల శనివారం తాండూరు పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్ఐలు అరవింద్, అబ్దుల్ రవూఫ్‌లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తాండూరు పట్టణ పోలీస్టేషన్ ఉత్తమ అవార్డును సాధించడం సంతోషకరమన్నారు. సీఐ, ఎస్ఐలతో పాటు పోలీసు సిబ్బంది కృషి అభినందనీయమన్నారు. ఉత్తమ అవార్డు పొందడం ఆదర్శనీయమన్నారు. సమాజంలో పోలీసులంటే ప్రజలకు భరోసా కల్పించడం, ప్రజారక్షణలో పోలీసులే కీలకపాత్ర వహిస్తారన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు పూర్తి సహాకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ వికారాబాద్ జిల్లా కార్యదర్శి నవాజ్ తదితరులు ఉన్నారు.

