పట్నం ఊపు తగ్గలే..!
– జనసంద్రదంలో తరలొచ్చిన యూత్
– పీఎంఆర్ బైకు ర్యాలీ గ్రాండ్ సక్సెస్
– ఎన్నికల స్టంట్ కాదన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– యువతను సన్మార్గంలో నడిపిస్తాం
– మాటిచ్చిన పట్నం రినీష్ రెడ్డి
– పీఎంఆర్ టోర్నమెంట్ విజేతలకు ట్రోపీ, నగదు ప్రధానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లానే శాసించిన పట్నం మహేందర్ రెడ్డికి ఉన్న ఊపు ఏమాత్రం తగ్గలేదని తాండూరులోని పీఎంఆర్ ట్రస్టు నిర్వహించిన కార్యక్రమం సాక్షంగా నిలిచింది. బుధవారం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నేతృత్వంలో ఆయన కుమారు పట్నం రినీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బైకు ర్యాలీ, క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీల ప్రధానోత్సవంలో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈనెల 1 నుంచి తాండూరు నియోజకవర్గంలో పీఎంఆర్ బ్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ట్రోఫీల ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. దీనిని పురస్కరించుకుని పట్నం దినీష్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో దాదాపు 5 వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఎన్నికల స్టంట్ కాదు: ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పీఎంఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో క్రీడాకారుల్లోని నైపుణ్యాలను వెలికి తీసేందుకు పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇది ఏమాత్రం ఎన్నికల సంట్ కాదని స్పష్టం చేశారు. యువతకు క్రీడలతో పాటు ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రతి యేడాది క్రీడా పోటీలు, బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ప్రజల కోసం ఆరోగ్య శిబిరాలు, సెప్టెంబర్ మాసం నుంచి పేదలకు సామూహిక వివాహాలు జరిపించేందుకు శ్రద్ధ తీసుకుంటాన్నారు.
యూత్ కోసం కార్యక్రమాలు : పట్నం రివీష్ రెడ్డి
దేశానికి యువతే వెన్నుముక అని అన్నారు. అలాంటి యువతను కొందరు నాయకులు స్వార్థం కోసం యువతను మత్తుకు బానిసలుగా చెడుదారిన పట్టిస్తున్నారని విమర్శించారు. యువతను సన్మార్గంలో నడిపించడంతో పాటు క్రీడలు, ఉదో గవకాశాలపై దృష్టి సారించేలా కృషి చేస్తామన్నారు. మాటల్లో తక్కువ చెప్పినా చేతల్లో ఎక్కువగా చూపిస్తామన్నారు. తాండూరు యువతకు ఇదే నామాటిస్తున్నా అని ప్రసంగించారు. అదేవిధంగా తాండూరులో ఓ వ్యక్తి పూజలు, యాగాలు అంటూ ప్రజలను, యువతను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆయన ఎన్ని పూజలు చేసినా… యాగాలు చేసినా.. ఆఖరుకు చేతబడి చేసినా… తాండూరు ప్రజలు ఆయస్ను క్షమించరని అన్నారు. తనదైన శైలిలో రినీష్ వేసిన పంచులు పేలడంతో యువత కేరింతలతో దద్దరిల్లింది. అనంతరం టోర్నమెంట్ నియోజకవర్గ స్థాయి విజేత జట్టుకు రూ. 2లక్షల నగదు, ట్రోఫీ, రన్నింగ్ జట్టుకు రూ. 1లక్ష నగదు, ట్రోఫీ అందజేశారు. దీంతో పాటు తాండూరు పట్టణం, మండల విజేత, రన్నింగ్ జట్లకు రూ. 50వేల నగదు, రూ. 5 వేల నగదు, ట్రోపీలు, ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కూతురు మనీషా రెడ్డి, అల్లుడు హిమదీప్, బీఆర్ఎస్ మాజీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, డిసిసిబి డైరెక్టర్ రవీందర్ గౌడ్, బషీరాబాద్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల వర్సింలు, సాయిపూర్ బాల్ గడ్డలి రవీందర్ సిద్రాల శ్రీనివాస్, మసూద్ అజయ్ ప్రసాద్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్లు పల్లెళ్ల నీరజాబాల్ రెడ్డి, అబ్దుల్ రజాక్, ప్రవీణ్ గౌడ్, బోయరవి, రాము, యువ నాయకులు బిడ్కర్ రఘు, రొంపల్లి సంతోష్ కుమార్, తాండ్ర రాకేష్, అశోక్, శ్రీకాంత్ రెడ్డి, దత్తు, నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నేతులు, కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు.
పురవీధుల్లో ర్యాలీ అదుర్స్
పీఎంఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన బైకు ర్యాలీ అదుర్స్ అనేంతలా జరిగింది. పట్టణంలోని విలియమూన్ చౌరస్తా వద్ద ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు, యువకులు, అభిమానులు పట్నం రినీష్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు.

అక్కడి నుంచి ఇందిరా చౌరస్తా, శివాజీ చౌరస్తా, భద్రేశ్వర్ చౌరస్తా మీదుగా ర్యాలీ పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానం వరకు సాగింది. ర్యాలీ కొనసాగిన మార్గంలో పట్నం రినీష్ రెడ్డి మహనీయులు, నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పురవీధుల్లో కొనసాగిన ర్యాలీలో తాండూరు పట్టణం. తాండూరు మండలం, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల నుంచి దాదాపు 5 వే ల మంది యువకులు, నేతలు పాల్గొన్నారు. రహదారులు మొత్తం నాయకులు, యువకులతో కిక్కిరిసి పోయింది. పోలీసులు ర్యాలీలో బందోబస్తు నిర్వహించారు.


