మొన్న పెడితే.. నిన్న హాంఫట్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మొన్న పెడితే.. నిన్న హాంఫట్..!
– మేకలకు ఆహారమైన మొక్కలు
– కొట్టొచ్చిన అధికారుల నిర్లక్ష్యం
– పెదవి విరుస్తున్న ప్రజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: మొక్కలే జీవకొటి ప్రాణాధారం. అలాంటి మొక్కలు నాటి పెంచడంలో ఎంతో శ్రద్ద, సంరక్షణ చర్యలు తీసుకోవాలి. అప్పుడే వాటిని నాటి, పెంచిన దానికి సార్థకత వస్తుంది. ఏదో పేరుకు నాటామంటే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఈ సంఘటన తెలియజేస్తుంది. ప్రస్తుతం తాండూరు పట్టణంలోని డివైడర్‌తో పాటు హైదరాబాద్ రోడ్డు మార్గంలోని రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ డివైడర్‌ మద్యలో మొక్కలు నాటుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ రోడ్డు మార్గంలోని డివైడర్‌ మొత్తం మొక్కలు నాటారు. కాని నాటిన మొక్కలకు ఎలాంటి రక్షణ కల్పించకపోవడంతో మేకలు, మూగజీవాలు మొత్తం హాంఫట్ చేశాయి. ఏ మొక్కకు ఆకులు కూడ లేనంతగా తినేశాయి. దీంతో ఈ మార్గంలోని మొక్కలన్నీ మోడువారి దర్శనమిస్తున్నాయి. గతంలో ఇదే డివైడర్‌లో నాటిన మొక్కలను సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ కోసం పీకేశారు. తాజాగా కూడా నాటిన మొక్కలకు ఎలాంటి రక్షణ కల్పించకపోవడంలో అధికారుల శ్రద్ద ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని పట్టణ ప్రజలు పెదవి విరుపు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా మిగిలిన మొక్కలకు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage