ఫోటో గ్రాఫర్ల పెద్ద మనసు..!
– మరణించిన తోటి ఫోటో గ్రాఫర్ కుటుంబానికి చేయూత
– రూ.1.40 లక్షలు అందించిన అసోసియేషన్ సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు మానవత్వం ప్రదర్శించారు. గుండెపోటుతో కన్నుమూసిన తోటి ఫోటో గ్రాఫర్ కుటుంబానికి ఆర్ధిక చేయూతనందించి పెద్ద మనుసును చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే తాండూరు పట్టణానికి చెందిన ఫొటో గ్రాఫర్ అశోక్ రెండు నెలల క్రితం వివాహా వేడుకలకు వెళ్లి గుండెపోటుకు గురై కన్నుమూశారు. అశోక్ కుమార్కు భార్య భారతమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ కుమార్ ను కోల్పోయిన కుటుంబానికి తాండూరు ఫొటో గ్రాఫర్ అసోసియేషన్ తోడ్పాటు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం అశోక్ కుటుంబానికి అసోసియేషన్ తరుపున రూ. 1.40 లక్షల ఆర్థిక సాయంను అందించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఫొటో గ్రాఫర్ అకాల మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. మాలో ఒకడిగా ఉన్న అశోక్ కుమార్ కుటుంబానికి అండగా నిలిచేందుకు తమవంతు చేయూతగా ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు నరేష్, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, సీనియర్ ఫోటో గ్రాఫర్స్ శరణు, కిషోర్, షాబోద్దీన్, అంబదాస్, హీరాలాల్, రాఘవేందర్, నాగప్ప, వీరణ్ణ, భాస్కర్, అంజి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…


