పెంటప్ప కుటుంబానికి అండగా ఉంటాం

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పెంటప్ప కుటుంబానికి అండగా ఉంటాం
– రూ. 5 వేలు సాయం అందజేసిన సర్పంచ్ మేఘనాథ్ గౌడ్
– కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీబీ డైరెక్టర్ రవీందర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వాగులో కొట్టుకుపోయిన మృతి చెందిన పెంటప్ప కుటుంబానికి అండగా ఉంటామని తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్ అన్నారు. గత శుక్రవారం రాత్రి సంగెంకలాన్ గ్రామానికి చెందిన బొక్తంపల్లి పెంటప్ప(48) బండల వాగులో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. మూడో రోజు ఆదివారం గ్రామ సమీపంలోని బస్వరాజ్ పొలం సమీపంలో పెంటప్ప మృతదేహం లభ్యమయ్యింది. గ్రామ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్ గ్రామస్తుల సహాకారంతో పోలీసులకు, వైద్య అధికారులకు సమాచారం అందించారు. దీంతో పెంటప్ప మృతదేహాన్ని వెలికి తీశారు. కరణ్‌ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి సమక్షంలో వైద్యుల సహాకారంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. పెంటప్ప అంత్యక్రియల కోసం రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు.

మరోవైపు డీసీసీబీ జిల్లా డైరెక్టర్, ఎల్మకన్నె పీఏసీఎస్ చైర్మన్ రవీందర్ గౌడ్ కూడా కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరుపున కుటుంబానికి సాయం అందజేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అమర్‌ నాథ్ గౌడ్, దశరథ్, దేవప్ప, మోయిన్, ఎరుకల రాజు, వెంకటి, లంబాడి లక్ష్మప్ప, చంద్రప్ప, రాములు తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage