స్కూల్ టైమింగ్‌లు మారాయి..!
– పాఠశాలలకు కొత్త పనివేళలు
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో స్కూళ్ల టైమింగ్‌లు చేంజ్ అయ్యాయి. పాఠశాలల పనివేళల్లో మార్పులు తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్‌జేడీఎస్‌ఈలకు విద్యాశాఖ పంపించింది. వారి పరిధిలోని ఎంఈవోలు, హెడ్‌మాస్టర్లు, పాఠశాలల యాజమాన్యాలకు సమయాల్లో మార్పులకు సంబంధించిన సూచనలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాలల సమయాల్లో చేసిన మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో కొన్ని మార్పులు చేయాలని గత కొంతకాలంగా పాఠశాల విద్యాశాఖ ఆలోచనలు చేస్తోంది.
ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తున్నాయి. తాజాగా విద్యా శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఇకపై ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ప్రాథమిక పాఠశాలలు, ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఉన్నత పాఠశాలలు పనిచేయనున్నాయి. అయితే రాష్ట్రంలోని జంట నగరాలు అయిన హైదరాబాద్-సికింద్రాబాద్ పరిధులలో మాత్రం ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి…


