ఆటో డ్రైవర్లకు రోహితన్న చేయూత
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– రూ.10లక్షల ప్రమాద బీమా బాండ్ల అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ఆటో డ్రైవర్లకు చేయూతనందించడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరులోని ఆటో డ్రైవర్లకు రూ. 10లక్షల ప్రమాద బీమా బాండ్ల పంపిణీ నిర్వహించారు. ప్రజాబంధు బృందం సహాయంతో గుర్తించిన లబ్దిదారులకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతుల మీదుగా బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రమాద బీమాపై ఆటో డ్రైవర్లకు అవగాహన లేకుండా నష్టపోతున్నారని అన్నారు. రోహితన్న చేయూత కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమాను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం), మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, రాష్ట్ర నాయకులు శ్రీశైల్ రెడ్డి, బీఆర్ఎస్ కేవీ తాండూరు అధ్యక్షులు కె.గోపాల్, ఆటో డ్రైవర్లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

