తాండూరుకు టీపీసీసీ రేవంత్ రాక
– ఎల్లుండి తాండూరు పట్టణంలో సమావేశం
– విజయవంతం చేయండి: ప్రభాకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా తాండూరులో చేపట్టే పర్యటన ఖరారు అయ్యింది. ఎల్లుండి ఈనెల 24న తాండూరు పట్టణంలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 26న చేవెళ్లలో నిర్వహించే ఎస్సీ, ఎస్టి డిక్లరేషన్ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ కార్గే ముఖ్య అతిథులుగా హజరవుతున్న నేపథ్యంలో తాండూరులో రేవంత్ రెడ్డి పర్యటన జరుగుతుందని చెప్పారు. ఇందులో భాగంగా 24వ తేదిన జీపీఆర్ గార్డెన్లో ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. కావున రేవంత్ రెడ్డి పర్యటనకు పార్టీ నేతలు, అనుంబంధ సంఘాల నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా 26న చేవేళ్లలో జరిగే డిక్లరేషన్ సభను కూడా జయప్రదానికి సిద్దం కావాలన్నారు.
ఇది కూడా చదవండి…

