ఇక వర్గాల్లేవ్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇక వర్గాల్లేవ్..!
– పైలెట్‌తో కలిసిపోయిన పట్నం వర్గం
– ఎంపీ రంజిత్‌ రెడ్డి సమక్షంలో భేటీ
– చర్చనీయాంశంగా మారిన సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్‌ భగ్గుమేనే వర్గపోరు ఇక సమిసినట్లుగా కనిపిస్తోంది. పట్నం వర్సెస్ పైలెట్ అనే చందంగా ఇరువర్గాల నేతల మద్య వర్గపోరు దూరం అయ్యే సంకేంతాలు దర్శనమిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా శనివారం హైదరాబాద్‌లో మంత్రి మహేందర్ రెడ్డి వర్గం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో భేటీ కావడం ఆసక్తిగా మారింది. చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి చొరవతో ఇరువర్గాల మద్య సయోధ్య కుదిరిటనట్లుగా ప్రచారం సాగుతోంది. గత కొన్ని నెలలుగా పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిల మద్య వర్గపోరు తీవ్రస్థాయికి వెళ్లిన సంగతి తెలిసిందే. మహేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు ఢీ అంటే ఢీ అనేంత వరకు వెళ్లింది. తాండూరు అసెంబ్లీ టిక్కెట్టు కోసం పోటీ పడ్డారు. టిక్కెట్టు రాకపోతే మహేందర్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం జరగడంతో బీఆర్ఎస్ అధిష్టానం ఆయనకు మంత్రి పదవి ఆఫర్ ఇచ్చి.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి టిక్కెట్‌ కన్ఫామ్ చేసింది.

దీంతో పట్నం, పైలెట్‌లు కలిసి పోయారు. అయితే మహేందర్ రెడ్డి వర్గం, రోహిత్ రెడ్డి వర్గం నేతల మద్య అసంతృప్తి వాతావరణం ఏర్పడడంతో సమస్యను పరిష్కరించాలని పెద్దలు నిర్ణయించారు. ఎంపీ రంజిత్ రెడ్డి సమక్షంలో శనివారం మంత్రి మహేందర్ రెడ్డి వర్గం నేతలు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలతో నేతల మద్య భేటి నిర్వహించినట్లు తెలిసింది. ఈ భేటిలో ఇరువర్గాల మద్య సయోధ్య కుదిర్చేందుకు పలు ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. నేతలు భేటి కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటి ఆదివారం మరోసారి ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి పట్నం మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డిలు కలిసి పోవడం.. వారి వర్గాలు కూడా కలిసి పోవడం రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ భేటిలో బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, తాండూరు పట్టణం, బషీరాబాద్, పెద్దేముల్, యాలాల మండలాలకు చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!