అన్నా, చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్
– మున్సిపల్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్
– స్కూల్, అంగన్‌వాడిలో రాఖీ పండగ
తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్నా, చెల్లెల్ల అనుబంధానికి రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తోందని తాండూరు మున్సిపల్ పరిధి 20వ వార్డు గాంధీనగర్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. బుధవారం గాంధీనగర్ లోని ప్రాథమిక పాఠశాల, అంగన్ వాడి కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. కౌన్సిలర్ సంగీత ఠాకూర్ ఆధ్వర్యంలో పాఠశాల, అంగన్ వాడి కేంద్రంలో విద్యార్థులు, చిన్నారులు రాఖీ పండగను జరుపుకున్నారు. అమ్మాయిలు అబ్బాయిలకు రాఖీలు కట్టారు. కౌన్సిలర్ సంగీత ఠాకూర్ కూడా విద్యార్థులకు, చిన్నారులకు రాఖీ కట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రక్షా బంధన్ అన్నా చెల్లెల్ల అనుబంధనానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. అందరు ఒకరికొకరు రక్షణగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్ వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..

