వేపాకు ధారిణిగా ఎల్లమ్మ దర్శనం

తాండూరు రాజకీయం వికారాబాద్

వేపాకు ధారిణిగా ఎల్లమ్మ దర్శనం
– నెహ్రుగంజ్ దేవాలయంలో శ్రావణ శోభ
– అమ్మవారిని దర్శించుకున్న భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం నెహ్రు గంజ్‌లో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి అమ్మవారు వేపాకు ధారణిగా ప్రత్యేక దర్శనమిచ్చారు. శ్రావణమాసం మూడో శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయంలో వెలసిన అమ్మవారికి పూజారి అంమ్రేష్‌ ఆధ్వర్యంలో అమ్మవారిని వేపాకులతో అలంకరణ చేశారు. దీంతో ఆలయంలో శ్రావణ శోభ సంతరించుకుంది. ప్రతి యేడాది ఆషాడమాసం, శ్రావణమాసం ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితి. ఇందులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. వేపాకుధారిణగా దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులకు ఆలయానికి దర్శించుకుని పూజలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!