రాజన్నకు చావులేదు..!
– చిరస్మరణీయుడు వైఎస్ఆర్
– తాండూరులో నివాళులు అర్పించిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల గుండెల్లో స్వర్గీయ వైఎస్ రాజశేఖ్ రెడ్డి(వైఎస్సార్) చావులేదని, ఆయన చిరస్మరణీయుడుగా నిలిచారని తాండూరు కాంగ్రెస్ నేతలు అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ 14వ వర్ధంతిని జరుపుకున్నారు. ఇందులో భాగంగా పట్టణ శివారులోని ఇందిరమ్మ కాలనీ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజా నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి చావులేదని అన్నారు. పేదల సంక్షేమానికి కృషి చేసిన్ వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని ఉద్ఘాటించారు. ఆయన ఆశయ సాధనకు తమవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, నాయకులు సయ్యద్ షుకూర్, యాలాల మండల అధ్యక్షులు భీమయ్య, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, బాతుల వెంకటయ్య, నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

